Telangana Maoist Bandh Call On December 9th: తెలంగాణలో ఈ నెల 9న బంద్‌కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ములుగుజిల్లా చెల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.. ఈ మేరకు లేఖను విడుదల చేశారు. ఈ ఎన్‌కౌంటర్ బూటకమని, ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఏడుగురు విప్లవకారులకు విషమిచ్చి పోలీసులు అతి కిరాతంగా చంపారని పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఆరోపించార. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.