తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్. త్వరలోనే కొత్త ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వరంగల్ జిల్లా మామూనూరు వద్ద బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే పనులు ప్రారంభం కానుండగా.. ఈ ఏడాది డిసెంబర్ నుంచి విమానాలు రాకపోకలు సాగించనున్నాయి.