Dharani Portal Abolishment: తెలంగాణ త్వరలోనే కొత్త చట్టం అమల్లోకి రానున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఉన్న ధరణి పోర్టల్‌ను రద్దు చేయనున్నట్టు ప్రకటించిన మంత్రి పొంగులేటి.. ఈ నెలాఖరులోగా కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు. అయితే.. అక్టోబర్ 07వ తేదీతో ప్రజాప్రభుత్వానికి 10 నెలలు పూర్తి కానున్నట్టు గుర్తుచేసిన మంత్రి.. ప్రజలు కోరుకున్న ప్రగతిని సాధించలేకపోయామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.