తెలంగాణలో ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్. త్వరలోనే రాష్ట్రంలో మరో ట్రైన్ లైన్ అందుబాటులోకి రానుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు ట్రైన్ మార్గం రాబోతుంది. వచ్చే ఐదేళ్లలో ఈ ట్రైన్ మార్గం పూర్తి చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.