తెలంగాణ ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్. త్వరలోనే మరో రైల్వే మార్గం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు మల్కన్‌గిరి-పాండురంగాపురం రైలుమార్గం నిర్మాణానికి రైల్వేశాఖ నిధులు మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభం కానుండగా.. వచ్చే ఐదేళ్లలో రైల్వే మార్గాన్ని పూర్తి చేయనున్నారు.