వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా నిర్మిస్తున్న స్మార్ట్ సిటీ మోడల్ బస్టాండ్ పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. ఈ బస్టాండ్‌కు రూ.74.50 కోట్ల వరకు అనుమతులు వచ్చాయి. అయితే దీని నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నా నిధుల కొరత, కాంట్రాక్టర్లతో వివాదాల వల్లే పనులు ఆగాయని ఆరోపణలు వస్తున్నాయి. కుడా (KUDA) వద్ద నిధులు లేకపోవడం.. ప్రభుత్వ బకాయిలు రాకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. కొత్త ఏడాదిలోనైనా ఈ పనులు ప్రారంభమై ప్రయాణికుల ఇబ్బందులు తొలగుతాయని ఆశిస్తున్నారు.