తెలంగాణలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లను నిర్మించనున్నారు. మొదటి విడతలో 13,137 కి.మీ. రోడ్లను రెండున్నరేళ్లలో నిర్మించనున్నారు. ఈ రోడ్లను డీబీఎం/బీఎం పొరలతో నిర్మించనున్నారు.