తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల కోసం అర్హులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులను గుర్తించేందుకు మంత్రి ఉత్తమ్ ఛైర్మన్‌గా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు విధివిధానాలు ఖరారు చేసి ప్రభుత్వానికి వివరాలు అందించనుంది.