తెలంగాణలో ఇప్పటి వరకు శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మాత్రమే ఉండేది. కాగా.. ఇప్పుడు రాష్ట్రానికి మరో ఎయిర్ పోర్ట్ కావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కార్ పలుమార్లు విజ్ఞప్తి చేస్తూనే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ కొత్త ఎయిర్ పోర్ట్ కోసం బీజం పడగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో వరుసగా విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. తాజాగా.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కలిసి వినతి పత్రం సమర్పించారు.