తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఊపందుకుంది. తాజాగా 2 లక్షల కార్డులు మంజూరు చేయడంతో మొత్తం సంఖ్య 91.83 లక్షలకు చేరింది, లబ్ధిదారులు 3.10 కోట్లకు పెరిగారు. అర్హులైన పేదల కోసం ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కార్డులు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఈ నెలలో మూడు నెలలకు సరిపడా సన్నబియ్యం ఒకేసారి తీసుకోవచ్చని తెలిపారు. నేటి నుంచే (జూన్ 1) ఈ ప్రక్రియ ప్రారంభం అయింది.