బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గత రాత్రి హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల ప్రాణ నష్టం సంభవించింది.