తెలంగాణలోని ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల నిరసనగా నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం నుంచి గత నాలుగేళ్లుగా రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య తెలిపింది. సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, బంద్ కొనసాగుతుందని సమాఖ్య స్పష్టం చేసింది. ఇంజినీరింగ్, ఫార్మా, బీఈడీ కళాశాలలు బంద్‌కు మద్దతు తెలుపుతున్నాయి.