తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. నేడు రాష్ట్రంలో భారీ వర్షాలకు ఛాన్స్ లేదని చెప్పారు. కాకపోతే.. పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లో సాయంత్రం తర్వాత జల్లులు పడుతాయన్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.