తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. కొందరికి ట్రాన్స్‌ఫర్లు కాగా.. మరికొందరికి కొత్తగా పోస్టింగ్‌లు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా డీసీపీలను బదిలీ చేశారు. నగరంలోని 4 కమిషనరేట్ల పరిధిలో భారీ ఎత్తున డీసీపీల ట్రాన్స్‌ఫర్లు జరిగాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 20 మంది ఐపీఎస్‌లకు బదిలీలు, పోస్టింగ్‌లు కల్పించారు.