ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీ పాక్స్ (ఎంపాక్స్)పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రం సూచనలతో మంకీపాక్స్ నివారణకు అవసరమైన మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు మన దగ్గర కేసులు నమోదు కాకపోయినా.. అప్రమత్తంగా ఉండాలన్నారు. కాగా, ఎంపాక్స్ ఇప్పటికే సుమారు 70 దేశాలకు పాకింది. 100 మంది ఎంపాక్స్‌తో మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.