తెలంగాణలో కొత్త బార్ లైసెన్సుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 41 కొత్త 2బీ బార్ లైసెన్సులకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలోని టీసీయూఆర్ ప్రాంతంలోనే 14 బార్లు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.1 లక్ష రుసుము చెల్లించాలి. ఈనెల 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రాంతాన్ని బట్టి వార్షిక ఎక్సైజ్ ఫీజు రూ.30 లక్షల నుంచి రూ.44 లక్షల వరకు నిర్ణయించారు.