ఫేస్‌బుక్‌లో మహిళ పరిచయం.. ఏకంగా రూ.14.61 కోట్లు పోగొట్టుకున్న డాక్టర్‌.. ఇల్లు అమ్మేసి మరీ!

5 hours ago 1
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ భారీ సైబర్‌ మోసానికి గురయ్యాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ ఆన్‌లైన్‌ స్టాక్‌ ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తాయని నమ్మించడంతో ఆయన నకిలీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లోకి దిగాడు. తొలుత చిన్న మొత్తాలకు భారీ లాభాలు వచ్చినట్లు చూపించి నమ్మకం పెంచిన సైబర్‌ నేరగాళ్లు.. ఆ తర్వాత కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టేలా చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక దశలో అకౌంట్‌లో భారీ లాభాలు కనిపించడంతో డాక్టర్‌ తన ఇంటిని కూడా విక్రయించి డబ్బులు సమకూర్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.14.61 కోట్లు బదిలీ చేసిన తర్వాత విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా మరిన్ని చార్జీల పేరుతో డబ్బు అడగడంతో మోసం బయటపడింది.
Read Entire Article