ఆదిలాబాదులోని రక్షణశాఖకు చెందిన వైమానిక విమానాశ్రయంలో పౌర విమాన సేవలు ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజ్ నాథ్ సింగ్ కీలక లేఖ రాశారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్‌కు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన భూసేకరణ పూర్తిచేయాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.