తెలంగాణ ప్రజలకు శుభవార్త! వరంగల్ తర్వాత, నిజామాబాద్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం సానుకూలంగా ఉంది. తాజాగా, రామగుండంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు కూడా అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఎంపీ గడ్డం వంశీకృష్ణ వినతి మేరకు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు భూములను పరిశీలించారు. గతంలో ఇక్కడ విమాన సేవలు ఉండటం, అనువైన పరిస్థితులు ఉండటంతో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు అవకాశాలు మెరుగుపడ్డాయి.