ఆసియాలోనే అతిపెద్ద మేడారం జాతరకు కేంద్ర మంత్రులు జుయెల్ ఓరం, కిషన్ రెడ్డి హాజరయ్యారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి, 'నిలువెత్తు బంగారం' సమర్పించారు. గిరిజన సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని, రూ.890 కోట్లతో ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించని పనులు ప్రారంభం అయ్యాయన్నారు. ఈ జాతర గిరిజన సంస్కృతికి ప్రతీక అని కొనియాడారు. జాతర నిర్వహణకు కేంద్రం సాయం చేస్తుందని తెలిపారు.