New Train Route Via Bhadradri: దేశంలో ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. కనెక్టివిటీని పెంచడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త రైల్వే ప్రాజెక్టులను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.24,657 కోట్లు కాగా.. కేంద్ర ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో మల్కాన్‌గిరి - పాండురంగాపురం వయా భద్రాచలం మీదుగా 174 కిలోమీటర్ల నూతన రైల్వే మార్గం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మేలు.