తెలంగాణలో గిగ్ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. వారికి సామాజిక భద్రత, బీమా వంటి సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురానున్నారు. దేశానికే మార్గదర్శకంగా నిలిచే ఈ చట్టం కోసం ప్రభుత్వం రాజస్థాన్, కర్ణాటక విధానాలను అధ్యయనం చేస్తోంది. ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, త్వరలోనే తుది చట్టాన్ని రూపొందించనున్నారు.