మాజీ మంత్రి కేటీఆర్ మరో బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతానని కేసీఆర్ తెలిపారు. వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగా.. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హెచ్‌సీయూ భూముల వ్యవహారంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామావలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని బండి సంజయ్ కాపాడుతున్నారని కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు.