ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో కొత్త బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. విద్య, ఉపాధి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయాలు వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంలో సహాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.