Skill University Chairman: సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ క్రియేట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో ఇంట్రెస్టింగ్ ప్రకటన చేశారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలతో భేటీ అయ్యారు. ఎన్‌ఆర్ఐ సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ఛైర్మన్‌గా ప్రకటించారు. మరో రెండు రోజుల్లోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిపారు.