అమెరికాలోని ప్రసిద్ధ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. అందుకు స్టాన్‌ఫర్డ్ బయోడిజైన్ సెంటర్ ప్రతినిధులు సముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. స్టాన్‌ఫర్డ్‌తో భాగస్వామ్యం తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు వేస్తుందని అన్నారు.