తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్ చెప్పారు. రూ.3 వేల కోట్లతో స్వయంఉపాధి పథకాలను అమలు చేస్తామన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొత్త పథకాలు అమలు చేయనున్నట్లు చెప్పారు.