New Ration Card Apply Online: తెలంగాణలో జనవరి 26న తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. గ్రామసభల్లో ప్రకటించిన అర్హుత జాబితాలో పేర్లులేని వారికి మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా సూపర్ ఛాన్స్ కల్పించింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చని తెలిపింది. కేవలం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులే కాకుండా మార్పులు చేర్పులు కూడా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని తెలిపింది.