తెలంగాణ వాసులను భానుడు మార్చిలోనే భయపెడుతున్నాడు. వేసవి కాలం మొదలైన రెండో వారంలోనే గరిష్ఠ ఉష్టోగ్రతలు నమోదవుతూ మాడు పగలగొడుతోంది. అయితే.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండగా.. రేపటి (మార్చి 13న) నుంచి భానుడితో దబిడి దిబిడే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్ నగరంలో పగటి పూట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు.