తెలుగు రాష్ట్రాలకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. రెండు రాష్ట్రాలకు రెండు కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రకటించింది. విశాఖపట్నం - కొల్లాం ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి - షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కొత్తగా పట్టాలెక్కించనుంది. ఆయా ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచడం మాత్రమే కాకుండా రద్దీగా ఉండే రైళ్లపై ఒత్తిడిని తగ్గించి.. ప్రయాణికులకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ఈ రెండు రైళ్లను ప్రవేశపెట్టింది.