తోడళ్లుళ్ల ముచ్చట్లు.. చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర్లు సంభాషణ

3 hours ago 2
వైజాగ్ వేదికగా జరిగిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఈ వేదికపై తోడల్లుళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు దాదాపు 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై వచ్చారు. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. అనంతరం సీఎం చంద్రబాబు దగ్గుబాటిని అభినందిస్తూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చంద్రబాబు, దగ్గుబాటిలు ఒకే వేదికపై కనిపించారు.. కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో ఇద్దరు కలుస్తున్నారు. కానీ ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, ఏపీ సీఎం చంద్రబాబు, ఎంపీ పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Read Entire Article