ఏపీ ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగులకు తీపికబురు వినిపించింది. సీపీఎస్ ఉద్యోగులకు తొలి విడత డీఏ బకాయిలను విడుదల చేసింది. సోమవారం ఒక్కో ఉద్యోగికి రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకూ డీఏ బకాయిలు జమ చేశారు. మిగతా ఉద్యోగులకు కూడా ఆరు విడతల్లో డీఏ బకాయిలు చెల్లించాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసింది.