సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో హల్చల్ చేస్తున్న లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌పై ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. జనవరి 1న తనను వివాహం చేసుకున్నాడని.. 12 రోజులకే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని సదరు యువతి దిమ్మతిరిగే ఆరోపణలు చేసింది. అఘోరీ తన జీవితంతో ఆడుకున్నాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు సదరు యువతి విజ్ఞప్తి చేసింది.