ఏపీలోని దీపం పథకం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. దీపం పథకం లబ్ధిదారులు పీఎన్‌జీలోకి మారినప్పటికీ.. వారికి ఇచ్చే రాయితీ సొమ్మును బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. ఆరు నెలల్లోగా 10 లక్షల పీఎన్‌జీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.