దుర్యోధనుడిగా రఘురామకృష్ణరాజు.. పగలబడి నవ్విన పవన్ కళ్యాణ్

1 month ago 7
విజయవాడలో ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం అత్యంత ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దుర్యోధనుడి వేషంలో నటించి అదరగొట్టారు. సీనియర్ ఎన్టీఆర్ ఫేమస్ డైలాగ్ ‘ఏమంటివి..ఏమంటివి?’ అంటూ రఘురామకృష్ణరాజు ఏకపాత్రాభినయం చేశారు. రఘురామ డైలాగ్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో పాటు అక్కడున్న వారి చప్పట్లతో ఆ ప్రాంగణమంతా మార్మోగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేచి నిలబడి మరీ రఘురామను చప్పట్లతో అభినందించారు. ఇక పల్నాటి బాలచంద్రుడి వేషంలో మంత్రి కందుల దుర్గేష్ కూడా అదరగొట్టేశారు.
Read Entire Article