Devineni Avinash Stopped In Shamshabad Airport: విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్‌కు ఎయిర్‌పోర్టులో చుక్కెదురైంది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు మంగళగిరి పోలీసులకుసమాచారమిచ్చారు. అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని మంగళగిరి పోలీసులు తెలిపారు. అధికారులు అవినాష్‌కు అడ్డు చెప్పడంతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో అవినాష్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.