దేవుడి పేరు చెప్పి అమాయకులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను శామీర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. దుర్గామాత విగ్రహం కోసం చందా ఇవ్వాలని బెదిరించి దేవుని దారం కట్టి ఓ అమాయకుడి నుంచి డబ్బులు వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు.