AP Telangana States Cms Meet In Delhi: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం కానున్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తుండగా, ఏపీ సమర్థిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురు సీఎంల భేటీ ఉత్కంఠ రేపుతోంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తరలింపు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.