ధర్మవరం ప్రజలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా చేనేతలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత.. 38 కోట్లతో ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఎనిమిది నెలల్లో దీనిని ప్రారంభిస్తామని.. ఎనిమిది వేల మందికి ఉపాధి దక్కుతుందని వెల్లడించారు.