ధాన్యం విక్రయించకుండానే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ..

7 months ago 23
మహబూబ్ నగర్ జిల్లా వీపనగండ్ల మండలంలోని గోపాల్ దిన్నె గ్రామంలో ధాన్యం కొనుగోళ్లలో రూ.15 లక్షల భారీ మోసం బయటపడింది. మహిళా సమాఖ్య కేంద్రంలో పని చేసే డాటా ఎంట్రీ ఆపరేటర్, ఒక రైస్ మిల్లు యజమానితో కుమ్మక్కై ఈ అక్రమానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అసలు వడ్లు కొనుగోలు చేయకుండానే.. ఐదుగురు రైతుల పేర్లతో ఆన్‌లైన్‌లో తప్పుడు వివరాలు నమోదు చేసి ప్రభుత్వ నిధులను తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. రెండు లారీల ధాన్యం మిల్లుకు వెళ్లినట్లు నకిలీ రికార్డులు సృష్టించారు. అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
Read Entire Article