Nandyal District Four Killed In Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్వాలిస్ కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లాలో కూడా శబరిమలై యాత్రికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది, అయితే ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.