నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొలిమిగుండ్ల మండలంలో జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వలనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ అధికారులను అరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.