నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భూమా కుటుంబానికి మద్దతుదారులుగా ఉన్న ఓ ఎంపీటీసీ, ఆమె భర్త తమ పదవులకు రాజీనామా చేశారు. శిరివెళ్ల మండలం గుంప్రమాన్‌దిన్నె ఎంపీటీసీ తులసమ్మ, ఆమె భర్త, వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఛైర్మన్ కుందనూరు మోహన్ రెడ్డి తమ పదవులను రాజీనామా చేశారు. వీరు వైసీపీలోకి వెళ్తున్నారంటూ సోషల్ మీడీయాలో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని ఖండించిన మోహన్ రెడ్డి.. తాము వ్యక్తిగత కారణాలతో పదవులకు రాజీనామా చేశాం కానీ.. పార్టీకి కాదని.. టీడీపీలోనే కొనసాగుతామని క్లారిటీ ఇచ్చారు.