హైదరాబాద్ నగరంలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిల కోసం 'వన్ టైమ్ స్కీమ్' (OTS)ను ప్రకటించింది. ఈ పథకం కింద పాత బకాయిలపై ఉన్న వడ్డీలో ఏకంగా 90 శాతం రద్దు చేస్తూ ప్రభుత్వం జీఓ నంబర్ 869 జారీ చేసింది. పన్ను చెల్లింపుదారులు అసలు సొమ్ముతో పాటు 10 శాతం వడ్డీ కడితే సరిపోతుంది. ఈ వెసులుబాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది.