గ్రేటర్ హైదరాబాద్ నగరానికి చేరువలో 84 గ్రామాలు, 1.32 లక్షల ఎకరాల భూములు, 584 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఇందులోని హిమాయత్‌సాగర్ జంట జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) నుంచి 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు, లే–అవుట్లకు 111 జీవో ప్రకారం అనుమతి లేదు. ఈ ప్రాంతంలోని ఏ స్థలంలో అయినా దాని విస్తీర్ణంలో కేవలం 10 శాతం మాత్రమే నిర్మాణాలు చేపట్టవచ్చు. కానీ, దీనిని ఉల్లంఘించిన నిర్మాణాలు జరిగాయి.