మంచు వారి కుటుంబంలో వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాస్త సద్దుమణిగినట్టు కనిపించినా.. మరోసారి మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు చేయటంతో మరోసారి కలహాలు బయటపడ్డాయి. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్ తన సోదరుడు విష్ణుపై ఫిర్యాదు చేశాడు. 150 మంది తన ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని.. తన కారుతో పాటు వ్యక్తిగత వస్తువులు కూడా దొంగిలించారంటూ ఫిర్యాదులో మనోజ్ పేర్కొన్నాడు.