'నా కూతురు వల్ల నా పరువు పోతుంది.. ఆమెను చంపేయ్'.. కుమార్తెను ప్రియుడితో చంపించిన తండ్రి

1 hour ago 2
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారు డిక్కీలో మహిళ మృతదేహం లభించిన కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలిని గోదావరిఖనికి చెందిన మానసగా గుర్తించారు. ఆమె వల్ల పరువు పోతోందనే కారణంతో కన్న తండ్రే హత్య చేయాలని ప్రియుడు వినోద్‌కుమార్‌ను ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. మానసను గొంతు నులిమి చంపిన అనంతరం మృతదేహాన్ని కారులో తరలించి పాతిపెట్టేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎల్కతుర్తి శివారులో వినోద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
Read Entire Article