బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు (ఫిబ్రవరి 17) సందర్భంగా తెలంగాణ రాష్ట్రమంతా గులాబీ శ్రేణులు ఘనంగా సంబురాలు జరుపుతున్నాయి. ఈ సందర్భంగా.. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన తండ్రి తనకు ఒక్కడికే హీరో కాదని.. తెలంగాణ జాతి మొత్తానికి హీరో అని చెప్పుకొచ్చారు. ఒక కారణజన్ముడి కడుపున పుట్టటం పూర్వజన్మ సుకృతమని కేటీఆర్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.