తెలంగాణలో హ్యామ్ రోడ్డు టెండర్ల చుట్టూ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. రూ. 8 వేల కోట్ల స్కామ్ జరుగుతోందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాటిని తీవ్రంగా ఖండించారు. టెండర్లు అన్నీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా జరుగుతున్నాయని.. తనపై బురద చల్లడం మానుకోవాలని కోమటిరెడ్డి హెచ్చరించారు. ఈ వివాదం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.