తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ కాలనీలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. వాటి గురించి జీహెచ్‌ఎంసీ అధికారులు గానీ పోలీస్ అధికారులు గానీ పట్టించుకోవటం లేదన్నారు. ఈద్గా గ్రౌండ్‌లో తనకు క్యాంప్ ఆఫీసుకు స్థలం ఇవ్వమంటే ఇవ్వలేదని.. సబ్ స్టేషన్‌కు కూడా తన ప్రమేయం లేకుండానే శంకుస్థాపన చేశారన్నారు. అందుకే తన రెగ్యులర్ స్టైల్‌లోనే వెళ్లి శిలాఫలకాన్ని పగలగొట్టినట్టు చెప్పుకొచ్చారు.